ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్సూరెన్స్ పేరుతో పాక్ మహిళ భారీ మోసం..!

ABN, First Publish Date - 2020-12-04T05:30:00+05:30

తాను చనిపోయినట్టుగా నకిలీ సర్టిఫికెట్లు చూపించి 1.5 మిలియన్ డాలర్ల విలువైన రెండు ఇన్సూరెన్స్‌లను క్లెయిమ్ చేసుకున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: నకిలీ డెత్ సర్టిఫికెట్లు చూపించి 1.5 మిలియన్ డాలర్ల విలువైన రెండు ఇన్సూరెన్స్‌లను క్లెయిమ్ చేసుకున్న ఓ కిలాడీ మహిళపై పాకిస్తాన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలిని సీమా ఖార్బేగా గుర్తించినట్టు ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ)కి చెందిన ఓ అధికారి వెల్లడించారు. 2008, 2009లో అమెరికా వెళ్లిన ఆమె... తన పేరు మీద రెండు భారీ లైఫ్ ఇన్సరెన్సులను తెచ్చుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. 2011లో ఆమె పాకిస్తాన్‌లోని ఓ వైద్యుడు సహా ప్రభుత్వాధికారులకు లంచమిచ్చి తన పేరుతో డెత్ సర్టిఫికెట్లు సంపాదించింది. తనను సమాధి చేసినట్టుగా కూడా సదరు సర్టిఫికెట్లలో రాయించింది. ఈ సర్టిఫికెట్ల ద్వారా ఆమె పిల్లలు 1.5 మిలియన్ డాలర్ల విలువైన రెండు లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కాజేశారు. పాకిస్తానీ రూపాయిల్లో దీనివిలువ 23 కోట్లు. కాగా చనిపోయినట్టు సర్టిఫికెట్లు సమర్పించిన తర్వాత కూడా ఆమె పది సార్లు కరాచీ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు ప్రయాణాలు సాగించడం మరో విశేషం. అయితే ఆమె భారీ ఇన్సూరెన్స్ మోసానికి పాల్పడినట్టు అమెరికా అధికారుల నుంచి ఫిర్యాదు రావడంతో పాకిస్తాన్ అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-12-04T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising