ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత ప్రభుత్వం ఇస్తున్న ఆ సర్టిఫికెట్లను తిరస్కరిస్తున్నాం: పాక్

ABN, First Publish Date - 2020-06-28T05:06:03+05:30

జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులకు భారత ప్రభుత్వం జారీ చేస్తున్న స్థిర నివాస ధృవీకరణ పత్రాలకు పాకిస్తాన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులకు భారత ప్రభుత్వం జారీ చేస్తున్న స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలను ‘‘తిరస్కరిస్తున్నట్టు’’ పాకిస్తాన్ తెలిపింది. కొత్త స్థిర నివాస చట్టం ప్రకారం 15 ఏళ్లకు పైబడి జమ్మూ కశ్మీర్‌లో నివసిస్తున్న స్థానికేతరులంతా శాశ్వత నివాస పత్రాలు పొందేందుకు అర్హులు. ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో వివిధ కేటగిరీలకు చెందిన స్థానికేతరులకు నివాస పత్రాలు జారీ చేసేందుకు భారత ప్రభుత్వం చట్టాలను సవరించింది. దీంతో ఇప్పటి వరకు దాదాపు 30 వేల మంది జమ్మూ కశ్మీర్‌లో స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు. అయితే భారత ప్రభుత్వం ఇస్తున్న ఈ సర్టిఫికెట్లను ‘‘తిరస్కరిస్తున్నా’’మంటూ పాకిస్తాన్ విదేశాంగ కార్యాలయం పేర్కొంది.


‘‘కాశ్మీరీయేతరులు సహా ఇతరులకు జమ్మూ కశ్మీర్‌లో భారత ప్రభుత్వం స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం చట్టం విరుద్ధం. ఇలా చేయడం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, 4వ జనీవా సమావేశ నిర్ణయాలు సహా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే. భారత ప్రభుత్వం కశ్మీర్ జనాభా నిర్మాణాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకుని దీన్ని ఆపాలి..’’ అని పాక్ విదేశాంగ శాఖ చెప్పుకొచ్చింది.

Updated Date - 2020-06-28T05:06:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising