ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై మళ్లీ విషం చిమ్మిన ఇమ్రాన్

ABN, First Publish Date - 2020-07-01T05:19:31+05:30

జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులకు భారత్ ఇస్తున్న స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలపై తాను ఐరాస

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: జమ్మూ కశ్మీర్‌లో స్థానికేతరులకు భారత్ ఇస్తున్న స్థిర నివాస ధ్రువీకరణ పత్రాలపై తాను ఐరాస చీఫ్‌ని కలిశానని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్‌ను తమ అంతర్భాగంగా చూపేందుకు ప్రయత్నించడం భారత్ చేసిన ‘‘మొదటి తప్పు’’ అయితే.. అక్కడ స్థిర నివాస పత్రాలు ఇవ్వడం మరో ‘‘తప్పు’’ అంటూ విషం చిమ్మారు. భారత ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన చట్టం ప్రకారం.. జమ్మూ కశ్మీర్‌లో 15 ఏళ్లకు పైబడి నివాసం ఉంటున్న వారంతా శాశ్వత నివాస అనుమతి పత్రాలు పొందేందుకు అర్హులు. దీనిపై ఇవాళ ఇమ్రాన్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘నేను దీనిపై ఐరాస చీఫ్‌ను సంప్రదించాను. మిగతా ప్రపంచ నాయకులను కూడా కలుసుకుంటాను...’’ అని చెప్పుకొచ్చారు. గతేడాది ఆగస్టు 5న కేంద్రం జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేయడంతో పాటు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన విషయం తెలిసిందే. నాటి నుంచి భారత్‌కు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ విఫలయత్నం చేస్తోంది.

Updated Date - 2020-07-01T05:19:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising