ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమల్‌హసన్‌తో పొత్తు పెట్టుకోనున్న ఒవైసీ...

ABN, First Publish Date - 2020-12-14T21:04:06+05:30

తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్, ఎంఐఎం ఒవైసీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : తమిళనాట సరికొత్త రాజకీయ శక్తి ఆవిర్భవించబోతోంది. మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు, నటుడు కమల్ హసన్, ఎంఐఎం ఒవైసీ మధ్య ‘పొత్తు’ పుట్టనుంది. వీరిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు సమాచారం. ఇద్దరూ ప్రాథమికంగా ఓ అంచనాకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సోమవారం ఎంఐఎం కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే ఒవైసీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. జనవరి మాసాంతంలో ఒవైసీ చెన్నైకి వెళ్లి, పొత్తుకు తుది రూపం ఇవ్వనున్నారు. తమిళనాట దాదాపు 25 సీట్లలో పోటీ చేయాలని ఎంఐఎం నిర్ణయించుకుంది. ఈ 25 సీట్లలోనూ కమల్ హసన్‌తో పొత్తు పెట్టుకోవాలని ఒవైసీ నిర్ణయించుకున్నారు.


బిహార్ ఎన్నికల్లో గెలిచినట్లుగానే తమిళనాట కూడా విజయం సాధించాలని ఒవైసీ భావిస్తున్నారు. అయితే తమిళనాట ఇప్పటికే అనేక ముస్లిం పార్టీలున్నాయి. అయితే వాటన్నింటినీ ఏకతాటిపైకి తేవాలని ఒవైసీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘అన్ని ముస్లిం పార్టీలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో నిలబడాలని ఒవైసీ భావిస్తున్నారు. కమల్ హసన్ పార్టీ, ఇతర చిన్న పార్టీలతో ఒవైసీ పొత్తు పెట్టుకుంటారు.’’ అని ఎంఐఎం వర్గాలు పేర్కొన్నాయి. వెల్లోర్, రాణిపేట్, తిరుపట్టూర్, కృష్ణగిరి, రామనాథపురం, పుడుకొట్టాయ్, తిరుచ్చి, మదురై, తిరునల్వేలీ ప్రాంతాల్లో ముస్లింలు అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్న ముస్లింలను ఆధారంగా చేసుకొని ఎంఐఎం తమిళనాట తన ఉనికిని చాటాలని డిసైడ్ అయ్యింది. 

Updated Date - 2020-12-14T21:04:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising