ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10వేలమంది రష్యన్ సైనికులకు కొవిడ్ టీకాలు

ABN, First Publish Date - 2020-12-11T16:53:24+05:30

కరోనా వైరస్ నివారణ కోసం స్పుత్నిక్ వి టీకాలను ఎలాంటి రియాక్షన్ లేకుండా 10వేల మంది రష్యన్ సైనికులకు వేసినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రష్యా రక్షణ మంత్రిత్వశాఖ వెల్లడి

మాస్కో (రష్యా) :కరోనా వైరస్ నివారణ కోసం స్పుత్నిక్ వి టీకాలను ఎలాంటి రియాక్షన్ లేకుండా 10వేల మంది రష్యన్ సైనికులకు వేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్ చెప్పారు. రష్యా రక్షణ మంత్రిత్వశాఖకు 14,500 టీకాలు వచ్చాయని, డిసెంబరు 10వతేదీ నాటికి 10,000 మంది సైనికులకు టీకాలు వేశామని కోనా షెంకోవ్ తెలిపారు. స్పుత్నిక్ వి టీకాల క్లినికల్ ట్రయల్సు విజయవంతం అయ్యాయని, ఈ టీకాలు వేయడంతో సైనికుల్లో రోగనిరోధకశక్తి అభివృద్ధి చెందిందని రక్షణశాఖ ప్రతినిధి వివరించారు. 


స్పుత్నిక్ వి టీకాలను సైనికులందరూ స్వచ్ఛందంగా స్వీకరించారని కోనా షెంకోవ్ చెప్పారు.ఈ ఏడాది చివరి నాటికి లక్షమంది సైనికులకు కొవిడ్-19 టీకాలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. రష్యా సైనికులకు టీకాలు వేసేందుకు 300 సైనిక వైద్యుల బ్రిగేడ్లను ఏర్పాటు చేశామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి వివరించారు.

Updated Date - 2020-12-11T16:53:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising