ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాది గుర్రంలాంటి మేనిఫెస్టో: కాంగ్రెస్

ABN, First Publish Date - 2020-09-20T22:24:40+05:30

తమ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను కాంగ్రెస్ తప్పికొట్టింది. కాంగ్రెస్ పార్టీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: తమ పార్టీ మేనిఫెస్టోపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శలను కాంగ్రెస్ తప్పికొట్టింది.  కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గుర్రంలాంటిదని, దానిని గాడిదతో పోల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆ పార్టీ ఎంపీ అహ్మద్ పటేల్ తప్పుపట్టారు.


రాజ్యసభలో వ్యవసాయ సంస్కరణల బిల్లులపై చర్చ సందర్భంగా అహ్మద్ పటేల్ మాట్లాడుతూ, తమ పార్టీ మేనిఫెస్టో‌ గురించి మాట్లాడేటప్పుడు బీజేపీ అధ్యక్షుడు ముందు కాంగ్రెస్ మేనిఫెస్టో చదవి, అందులోని కొన్ని పాయింట్లు బీజేపీ మేనిఫెస్టోతో పోల్చి మాట్లాడిదే బాగుండేదని అన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తాము రూపొందించిన మేనిఫెస్టో గుర్రంలాంటిదని అన్నారు. అయితే దానిని గాడిదతో పోల్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందన్నారు.


'మేము మేనిఫెస్టోలో చెప్పిన 22 పాయింట్లలో రెండు పాయింట్లు మాత్రమే వాళ్లు (బీజేపీ) చదివారు. రైతులకు ఉపయోగపడే సంస్కరణలను మేము సూచించాం. కానీ ప్రస్తుత బిల్లులు రైతుల ప్రయోజనాలను ఏమాత్రం కాపాడేలా లేవు. కార్పొరేట్ల ప్రయోజనాలను మాత్రమే ఈ బిల్లులు కాపాడతాయి' అని అహ్మద్ పటేల్ అన్నారు. కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వ్యవస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకే ఈ బిల్లులను తెచ్చారని ఆయన ఆరోపించారు. పంటలు కొనుగోలు చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కి ఇందులో ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆయన విమర్శించారు.

Updated Date - 2020-09-20T22:24:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising