ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో 2 వారాల్లో రష్యా డాక్టర్లకు కరోనా టీకా..!

ABN, First Publish Date - 2020-08-13T03:58:58+05:30

ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన రష్యా వాటిని దేశ ప్రజలకు ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో: ప్రపంచంలోనే మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్‌ను రూపొందించిన రష్యా.. ఈ టీకాను దేశ ప్రజలకు ఇచ్చేందుకు తగు ఏర్పాట్లు చేస్తోంది.  తొలి విడత టీకా కార్యక్రమంలో భాగంగా మరో రెండు వారాల్లో డాక్టర్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తామని రష్యా ఆరోగ్య శాఖ మంత్రి బుధవారం నాడు ప్రకటించారు. అయితే టీకా తీసుకుంటామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారికి మాత్రమే ఈ వ్యాక్సిన్ అందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ‘మరో రెండు వారాల్లో సిద్ధమయ్యే తొలి టీకా బ్యాచ్‌ను డాక్టర్లకు అందిస్తాం’ అని ఆయన తెలిపారు. కరోనా టీకాను సామాన్య ప్రజలకు అందించేందుకు అనుమతించినట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ మంగళవారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ టీకా పూర్తిగా సురక్షితమైనదని, తన కూతురు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకుందని తెలిపారు.

Updated Date - 2020-08-13T03:58:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising