ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రక్షణావసరాలను తెలిపేందుకు ఆన్‌లైన్‌ పోర్టల్‌

ABN, First Publish Date - 2020-08-15T08:32:16+05:30

రక్షణ శాఖ అవసరాలను ప్రైవేటు సంస్థలు తెలుసుకునేందుకు గాను ‘శ్రీజన్‌’ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ప్రారంభించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ప్రారంభించిన రాజ్‌నాథ్‌ సింగ్‌


న్యూఢిల్లీ/వాషింగ్టన్‌/ఇస్లామాబాద్‌, ఆగస్టు 14: రక్షణ శాఖ అవసరాలను ప్రైవేటు సంస్థలు తెలుసుకునేందుకు గాను ‘శ్రీజన్‌’ అనే ఆన్‌లైన్‌ పోర్టల్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం ప్రారంభించారు. ప్రభుత్వ రంగ రక్షణ సంస్థలు(డీపీఎ్‌సయూ), సాయుధ బలగాల ప్రధాన కార్యాలయాలు తాము దిగుమతి చేసుకుంటున్న పరికరాలను ఈ పోర్టల్‌లో ప్రదర్శిస్తాయని, తద్వారా దేశీయ సంస్థలకు ఏ ఉత్పత్తులు రూపొందించాలన్నదానిపై అవగాహన వస్తుందని ఆయన వివరించారు. అన్‌మాన్డ్‌ ఏరియల్‌ వెహికల్స్‌(యూఏవీ)లను అభివృద్ధి పరిచేందుకై బీఈఎంఎల్‌, ఐఐటీ కాన్పూర్‌ మధ్య ఒప్పందం(ఎంవోయూ), కృత్రిమ మేధ, కంప్యుటేషన్‌ తదితర రంగాల విషయంలో గోవా షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌తో ఐఐటీ గోవా ఎంవోయూలు కుదిరాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కాగా, తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జూన్‌ 15న చోటుచేసుకున్న సైనిక ఘర్షణకు కారకుల్ని గుర్తించి శిక్షించాలంటూ చైనా తాజాగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం ప్రతి నెలా ప్రచురించే చైనా-ఇండియా రివ్యూ అనే పత్రికలో కథనాన్ని ప్రచురించింది. భారత్‌ తన బలగాలను క్రమశిక్షణలో ఉంచుకోవాలని, గల్వాన్‌ లోయ తరహా ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చైనా సలహా ఇచ్చింది. 


Updated Date - 2020-08-15T08:32:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising