ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘాటెక్కిన ఉల్లి కిలో రూ.100

ABN, First Publish Date - 2020-10-22T08:14:25+05:30

ఉల్లి ధర ఘాటెక్కింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట తీవ్రంగా నష్టాల పాలై హైదరాబాద్‌కు దిగుబడి తగ్గడంతో విపరీతంగా డిమాండ్‌ పెరిగింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎర్రగడ్డ/న్యూఢిల్లీ, అక్టోబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఉల్లి ధర ఘాటెక్కింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉల్లి పంట తీవ్రంగా నష్టాల పాలై హైదరాబాద్‌కు దిగుబడి తగ్గడంతో విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. రెండు రోజుల క్రితం బహిరంగ మార్కెట్లో కిలో రూ.24 ఉన్న ఉల్లిధర ఇపుడు వంద రూపాయలకు చేరింది. రైతుబజార్లలో బుధవారానికి రూ.84కు చేరింది. వర్షాలవల్ల ఎక్కువశాతం ఉల్లిగడ్డలు కుళ్లిపోయాయని, దిగుబడి తగ్గిందని ఎర్రగడ్డ రైతుబజార్‌ ఎస్టేట్‌ అధికారి రమేశ్‌ తెలిపారు.అంతేకాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు నుంచి  దిగుబడి పూర్తిగా తగ్గిపోవడం వల్ల ధరలు అమాంతం పెరిగాయని అన్నారు. కాగా, ఉల్లి దిగుమతులపై డిసెంబరు 15 వరకు నిబంధనలను సడలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దేశంలో పెరిగిపోయిన ఉల్లి ధరలను దీని ద్వారా నియంత్రించే ప్రయత్నం చేయాలని సర్కారు భావిస్తోంది.  

Updated Date - 2020-10-22T08:14:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising