ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వికాస్ దూబే మరో అనుచరుడు అరెస్ట్

ABN, First Publish Date - 2020-07-08T18:12:55+05:30

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాన్పూర్ ఎన్‌కౌంటర్ కేసులో ప్రధాన నిందితుడు, గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే అనుచరుడొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం చౌబేపూర్ ప్రాంతంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో దూబే అనుచరుడు శ్యాము బాజ్‌పాయ్‌ని అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ‘‘చౌబేపూర్ ప్రాంతంలో జరిగిన ఓ ఎన్‌కౌంటర్ అనంతరం వికాస్ దూబే అనుచరుడు శ్యాము బాజ్‌పాయ్ అరెస్ట్ అయ్యాడు. బాజ్‌పాయ్ మీద రూ.25 వేల రివార్డు ఉంది. ఎన్‌కౌంటర్‌లో అతడి కాలికి గాయం అయ్యింది...’’ అని చౌబేపూర్ ఎస్‌హెచ్‌ఓ కేఎం రాయ్ తెలిపారు. ఈ నెల 3న కాన్పూర్‌లోని బిక్రులో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో బాజ్‌పాయ్ నిందితుడిగా ఉన్నాడు. కాగా ఇవాళ ఉదయం హమీర్పూర్ సమీపంలోని మౌదాహలో స్పెషల్ టాస్క్ పోలీసులు వికాస్ దూబే అత్యంత సన్నిహిడు అమర్ దూబేని మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-07-08T18:12:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising