ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిన్నెసొటాలో నాలుగో రోజూ కొనసాగుతున్న ఆందోళన.. పోలీస్ స్టేషన్‌కు నిప్పు!

ABN, First Publish Date - 2020-05-29T21:52:13+05:30

నల్లజాతీయుడు జార్జ్ ఫాయిడ్ మరణంతో అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిన్నెసొటాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిన్నెసొటా: నల్లజాతీయుడు జార్జ్ ఫాయిడ్ మరణంతో అమెరికాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మిన్నెసొటాలో ఎగసిన ఆగ్రహజ్వాలలు ఇప్పుడు అమెరికా అంతటికీ విస్తరిస్తున్నాయి. ఫాయిడ్‌ మరణానికి కారణమైన పోలీసులపై జనం మండిపడుతున్నారు. వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో కెంటకీలో ఏడుగురు ఆందోళనకారులు మృతి చెందడంతో పరిస్థితి మరింత దిగజారింది.  


ఆందోళనకారులు గురువారం పొద్దుపోయాక పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కిటికీలు పగలగొట్టడంతో పరిస్థితి విషమిస్తోందని భావించిన పోలీసులు మిన్నియాపోలీస్ భవాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత భవానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. శుక్రవారం నాలుగో రోజూ మిన్నెసొటాలో ఆందోళనలు కొనసాగాయి. అంతేకాదు డెన్వెర్, కొలరాడో, ఫోనిక్స్‌లోనూ పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటాయి. మిన్నెసొటా ఆందోళనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. నకిలీ నోట్ల అనుమానంతో సోమవారం 46 ఏళ్ల జార్జ్ ఫ్లాయిడ్‌ను అడ్డుకున్న పోలీసులు ఆయనను కారు నుంచి దింపి సంకెళ్ల వేశారు. ఈ క్రమంలో ఆయన మెడపై కాలుపెట్టిన ఓ పోలీసు.. ఊపరి ఆడడం లేదని, కాలు తీయాలని ఫాయిడ్ వేడుకున్నా కనికరించలేదు. దీంతో చివరికి అతడు ఊపిరి ఆడక మరణించాడు. అతడి మరణంతో అమెరికా వ్యాప్తంగా నల్లజాతీయులు ఆందోళనకు దిగారు. గత నాలుగు రోజులుగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. 

Updated Date - 2020-05-29T21:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising