ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైరల్ వీడియో: ‘మా సీఎం రేంజ్ అది’ అంటూ మురిసిపోతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2020-05-23T16:49:09+05:30

భారత్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ముఖ్యమంత్రి పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆయనే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ ముఖ్యమంత్రి పేరు ట్రెండింగ్‌లో ఉంది. ఆయనే మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా. ఇక  మేఘాలయ వాసులైతే.. ఇదీ.. మా ముఖ్యమంత్రి రేంజ్’ అంటూ సంగ్మాను పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇదేదో రాజకీయ పరమైన ప్రసంశలు అనుకుంటే మీరు పొరబడ్డట్టే. రాజకీయాలకూ ప్రస్తుత ఉదంతానికి ఎటువంటి సంబంధం లేదు. కేవలం 43 సెకెన్ల నిడివి ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సంగ్మాను నెటిజన్ల ఫేవరెట్‌ అయ్యేలా చేసింది.


ఈ వీడియోలో ఆయన.. 1980 నాటి రాక్ బ్యాండ్ ఐరస్ మేయిడెన్ పాడిన వేస్టేడ్ ఇయర్స్ పాటకు గిటార్ వాయించారు. ‘ముడు రోజల పాటు జరిగిని బీజీ అంసెబ్లీ సమావేశాల తరువాత రిలాక్స్ అవడానికి ఐరన్ మెయిడ్స్ పాటకు గిటార్ వాయించా. చాలా రోజుల తరువాత చేస్తున్న ప్రయత్నం కాబట్టి కొన్ని పొరపాట్లు దొర్లొచ్చు’ అంటూ ఆయన చివర్లో చిన్న కామెంట్ కూడా జత చేశారు. అయితే.. ఈ వీడియో అప్‌లోడ్ అయిన కొద్ద సేపటికే తెగ వైరల్ అయిపోయింది.


నిపుణుడైన వాయిద్యకారుడి స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి నైపుణ్యం నెటిజన్లను అచ్చెరువొందేలా చేస్తోంది. నిత్యం రాజకీయాల్లో మునిగితేలే ఓ సీఎంకు ఇంతటి కళానైపుణ్యం ఉందా అని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమ సీఎంను చూసి మేఘాలయ వాసులు ఎంతగా గర్విస్తున్నారో వారి కామెంట్లే చెబుతున్నాయి. ‘అదీ మా సీఎం అంటే’ అని ఒకరు అంటే.. ‘సీఎం మమ్మల్ని ప్రతిసారీ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉంటారు’ అని మరికొందరు మురిసిపోయారు. నిన్న రాత్రి పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటి వరకూ నెటిజన్లు 24 వేల సార్లు చూశారు. ఫేస్‌బుక్, ట్విటర్‌లో కూడా సంగ్మాపై ప్రసంశల వర్షం కురుస్తోంది. 



Updated Date - 2020-05-23T16:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising