బీజేపీ నేత కుటుంబం ఊచకోతను ఖండించిన ఒమర్ అబ్దుల్లా
ABN, First Publish Date - 2020-07-09T05:04:32+05:30
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనపై మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఘటనను ఆయన ఖండించారు. వసీం బారి కుటుంబానికి ఆయన సానుభూతి తెలిపారు. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారిని లక్ష్యం చేసుకుని జరుగుతున్న హింసాత్మక దాడులను ఒమర్ అబ్దుల్లా తప్పుబడుతూ ట్వీట్ చేశారు.
బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. వసీం బారి దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. వసీం బారి దుకాణం సరిగ్గా పోలీస్ స్టేషన్‌కు ఎదురుగానే ఉంటుంది. వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.
Updated Date - 2020-07-09T05:04:32+05:30 IST