ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా రాష్ట్రంలో ఫ్యాక్టరీ పెడితే.. ఎలన్ మస్క్‌కు బంపరాఫర్

ABN, First Publish Date - 2020-05-19T22:27:31+05:30

ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రం బంపరాఫర్ ఇచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓక్లహామా: ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్‌కు అమెరికాలోని ఓక్లహామా రాష్ట్రం బంపరాఫర్ ఇచ్చింది. కాలిఫోర్నియా ప్రభుత్వ విధానాలతో చిర్రెత్తిన మస్క్.. ఇదే పరిస్థితి కొనసాగితే తన ప్రధాన కార్యాలయాన్ని వేరే రాష్ట్రానికి తరలిస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి మస్క్‌కు ఆఫర్లు అందుతున్నాయి. ఈ క్రమంలోనే ఓక్లహామా రాష్ట్రం ఓ బంపరాఫర్ ప్రకటించింది. మస్క్ గనక తన టెస్లా కంపెనీ గిగాఫ్యాక్టరీని తమ రాష్ట్రంలో పెడితే.. ఆ కంపెనీ తయారు చేసే సైబర్‌ట్రక్కులనే పోలీసు శాఖ ఉపయోగిస్తుందని తెలిపింది. ఈ మేరకు ఓక్లహామా మేయర్ జీటీ బైనమ్ ఓ ట్వీట్ చేశారు.


‘ప్రపంచాన్ని మార్చడానికి టెస్లా, టుల్సా(ఓక్లహామాలో ఓ నగరం) చేతులు కలిపితే, ఇలా చేయడమే సరైన పని’ అంటూ పోలీసు వాహనంలా గ్రాఫిక్స్ చేసిన సైబర్‌ట్రక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫ్యాక్టరీని టెక్సాస్‌లో పెట్టాలని టెస్లా కంపెనీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలోనే ఓక్లహామా మేయర్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.



Updated Date - 2020-05-19T22:27:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising