ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా వ్యాక్సిన్ వారికి ఫ్రీ: ప్రకటించిన ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-12-18T01:07:17+05:30

తొలి దశలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తోందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హెల్త్ వర్కర్లకు ఫ్రీ కరోనా వ్యాక్సిన్: ఒడిశా ప్రభుత్వం

కరోనా కష్టకాలంలో బాధితులకు సేవ చేసిన హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని ఒడిశా ప్రభుత్వం గురువారం ప్రకటించింది. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి.. తొలి దశలో వైద్యులు, వైద్య సిబ్బంది, వయసు పైబడిన వారికి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నబకిశోర్ దాస్ తెలిపారు. రెండో దశలో.. మున్సిపాలిటీ, ఎలక్ట్రిసిటీ, తాగు నీటి సరఫరా సిబ్బంది, పబ్లిక్ హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్‌ను అందించాల్సిందిగా కేంద్రాన్ని కోరనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు.


తొలి దశలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్‌ను అందించాలని కేంద్రం భావిస్తోందని, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో వ్యాక్సిన్ పంపిణీ జరగనుందని దాస్ స్పష్టం చేశారు. మొదటి దశలో ఒడిశాలో 3.2 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్‌ను ఇవ్వనున్నట్లు తెలిపారు. కరోనా పంపిణీ కోసం ఒడిశా వ్యాప్తంగా 29,276 కేంద్రాలను గుర్తించినట్లు మంత్రి కిషోర్ దాస్ పేర్కొన్నారు.

Updated Date - 2020-12-18T01:07:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising