ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల సరసన ఒడిశా
ABN, First Publish Date - 2020-12-31T02:04:01+05:30
ఈ విధంగా, ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా ఒడిశా 1,429 కోట్ల రూపాయల అర్హతను సాధించినట్లు కేంద్రం పేర్కంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ జారీ చేసిన అర్హతలు సాధించినట్లు డిసెంబర్ 30న విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కంది
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్దేశించిన సులభతర వ్యాపారాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న రాష్ట్రాల జాబితాల్లో ఒడిశా చేరిందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు ఆర్థిక వనరులను సమీకరించడానికి రాష్ట్రం అర్హత సాధించిందని పేర్కొంది. ఈ విధంగా, ఓపెన్ మార్కెట్ రుణాల ద్వారా ఒడిశా 1,429 కోట్ల రూపాయల అర్హతను సాధించినట్లు కేంద్రం పేర్కంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్ జారీ చేసిన అర్హతలు సాధించినట్లు డిసెంబర్ 30న విడుదల చేసిన ప్రకటనలో కేంద్ర ఆర్థిక శాఖ పేర్కంది. ఒడిశా కంటే ముందు దేశంలో ఆరు రాష్ట్రాలు సులభతర వ్యాపారాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు ఇప్పటి వరకు సులభతర వ్యాపారాన్ని అమలు చేస్తుండగా, వీటి తర్వాత ఏడవ రాష్ట్రంగా ఒడిశా ఈ జాబితాలో చేరింది.
Updated Date - 2020-12-31T02:04:01+05:30 IST