ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించింది వాస్తవమే...

ABN, First Publish Date - 2020-04-04T15:01:30+05:30

కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన వాస్తవమేనని ఘజియాబాద్ పోలీసుల దర్యాప్తులో....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలీసుల దర్యాప్తులో తేలిన నిజం 

ఘజియాబాద్ : కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన తబ్లిగ్ జమాత్ సభ్యులు అర్దనగ్నంగా తిరుగుతూ నర్సులను వేధించిన ఘటన వాస్తవమేనని ఘజియాబాద్ పోలీసుల దర్యాప్తులో తేలింది. క్వారంటైన్ లో ఉన్న ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, ఆసుపత్రిలో అర్దనగ్నంగా తిరుగుతూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు.


కరోనావైరస్ అనుమానితులు ఆసుపత్రిలో ప్యాంటు లేకుండా తిరిగారని ఫిర్యాదులో ఒక నర్సు ఆరోపించారు. వారు అసభ్యకరమైన పాటలు పాడుతూ, వికారమైన హావభావాలు ప్రదర్శించారని నర్సులు పోలీసులకు దర్యాప్తులో చెప్పారు. కరోనా అనుమానితులకు తాము ఇచ్చిన మందులు తీసుకోవడం లేదని మరో నర్సు ఆరోపించారు. నిందితులు సామాజిక దూర నిబంధనలను పాటించడం లేదని మరో నర్సు పోలీసులకు చెప్పారు.


నర్సుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు జమాత్ సభ్యులపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్లు 269, 270, 271, 294, 354 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు నివేదికను జిల్లా మెజిస్ట్రేట్ కు సమర్పించారు. నర్సుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఐదుగురు జమాత్ నిందితులపై ఘజియాబాద్ పోలీసులు కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. అనంతరం ఆరుగురు జమాత్ సభ్యులను ఆసుపత్రి నుంచి ఓ ప్రైవేటు విద్యాసంస్థలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుకు తరలించారు. నర్సులను వేధించిన కరోనా అనుమానితులపై తాము కఠినచర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కళానిధి నైతానీ చెప్పారు. 

Updated Date - 2020-04-04T15:01:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising