ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవార్‌కు ఆదాయ పన్ను శాఖ నోటీసు

ABN, First Publish Date - 2020-09-23T07:40:59+05:30

ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసిందని ఎన్సీపీ అధినేత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, సెప్టెంబరు 22 : ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ తనకు నోటీసులు జారీ చేసిందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ వెల్లడించారు. ఆ అఫిడవిట్లపై వివరణ కోరిందని చెప్పారు. ‘అందరి కన్నా నా పైనే వారు(కేంద్రం) ఎక్కువ ప్రేమ చూపడం సంతోషంగా ఉంది.


అఫిడవిట్లపై ఎన్నికల సంఘం వివరణ కోరిన వెంటనే.. ఆదాయ పన్ను శాఖ కూడా నోటీసులు పంపింది. ఆ నోటీసులకు జవాబు ఇస్తాను’ అని పవార్‌ చెప్పారు. పవార్‌ కూతురు, ఎంపీ సుప్రియా సూలే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, మంత్రి ఆదిత్య ఠాక్రేలకు కూడా ఇలాంటి నోటీసులే అందాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులుగా పవార్‌ చెప్పారు.

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారంటూ వస్తున్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. రాష్ట్రపతి పాలన విధించడం అంత తేలికమైన విషయం కాదని, అసలు రాష్ట్రపతి పాలన విధించడానికి కారణాలు ఏవైనా ఉన్నాయా? అని పవార్‌ అన్నారు. 

Updated Date - 2020-09-23T07:40:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising