ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అది పిరికితనం..మేము భయపడం: సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2020-12-28T23:17:52+05:30

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన భార్య వర్షారౌత్‌కు సమన్లు జారీ చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తన భార్య వర్షారౌత్‌కు సమన్లు జారీ చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇది 'పిరికిపందల చర్య' అని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థ (ఈడీ) పలువురు రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుంటోందని అన్నారు. పీఎంసీ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో ఈడీ ఈ సమన్లు పంపింది.


దీనిపై సంజయ్ రౌత్ సోమవారంనాడు మీడియాతో మాట్లాడుతూ...'ఇళ్లలోని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం పిరికిపందల చర్య. మేము ఎవరికీ భయపడటం. తగిన విధంగా స్పందిస్తాం. ఈడీకి కొన్ని పేపర్లు అవసరం. సకాలంలో వాటిని సమర్పిస్తాం' అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. తనపై బీజేపీ నేతలకు ఉన్న 'అసహనానికి' నిదర్శనమే ఈడీ చర్య అని ఆయన పేర్కొన్నారు. గత ఏడాది మహా ఘట్ బంధన్ (ఎంవీఏ) ప్రభుత్వం ఏర్పాటులో తన పాత్ర, ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకపోవడమే వారి అసహనానికి కారణమని అన్నారు.


ఏడాదిలో ఎందరంటే...

'కేవలం ఒక్క ఏడాదిలోనే శరద్ పవార్, ఏక్‌నాథ్ ఖడ్సే, ప్రతాప్ సర్నాయక్‌లకు నోటీసులు పంపారు. ఇప్పుడు నా పేరు కూడా చర్చల్లోకి వచ్చింది. వీరంతా మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటులో కీలక వ్యక్తులే' అని రౌత్ అన్నారు. నోటీసులపై మాట్లాడుతూ...'ఇది పేపరు ముక్కల వ్యవహారం, అంతకంటే ఏమీ కాదు' అని కొట్టిపారేశారు.


పదేళ్ల తర్వాత మేల్కొన్న ఈడీ

పదేళ్ల తర్వాత ఈడీ మేల్కొందని, తమది మధ్యతరగతి కుటుంబమని, తన భార్య ఒక  టీచర్ అని రౌత్ తెలిపారు. 'మేము మధ్యతరగతి వాళ్లం. పదేళ్ల క్రితం ఒక ఇల్లు కొనేందుకు నా భార్య రుణం తీసుకుంది. ఆదాయం పన్ను శాఖకు ఆ వివరాలు ఇచ్చాం. రాజ్యసభ అఫిడవిట్‌లో కూడా ఈ విషయం ప్రస్తావించాను. పదేళ్ల తర్వాత ఈ డీల్ విషయంలో ఈడీ మేల్కొంది' అని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈడీ, సీబీఐ దాడులు జరిగితే అందులో ఎంతో కొంత నిజం ఉండేదని, కానీ ఇప్పుడు వాటిని పట్టించుకోనవసరం లేదని, ఇవన్నీ రాజకీయ ప్రేరేపితాలేనని అన్నారు. ఎవరి మీద కోపం ఉంటే వారిమీద ఏజెన్సీలను ఉసిగొల్పుతున్నారని అన్నారు. ఈడీ సమన్లను మరీ పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని అన్నారు. సత్తా ఉంటే రాజకీయాల్లో ముఖాముఖీ తలపడాలి కానీ, ఇలా ఏజెన్సీలను ఉసిగొల్పడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2020-12-28T23:17:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising