ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అన్ని రైళ్లు ఎప్పుడు నడుస్తాయన్న దానిపై రైల్వే బోర్డ్ కీలక ప్రకటన

ABN, First Publish Date - 2020-12-18T21:42:44+05:30

కోవిడ్-19 నేపథ్యంలో నిలిచిపోయిన పలు సాధారణ రైళ్ల రాకపోకలు మళ్లీ ఎప్పటి నుంచి మొదలు కానున్నాయనే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాధారణ రైళ్ల రాకపోకలపై కచ్చితమైన తేదీని చెప్పలేం: రైల్వే బోర్డ్

న్యూఢిల్లీ: కోవిడ్-19 నేపథ్యంలో నిలిచిపోయిన పలు సాధారణ రైళ్ల రాకపోకలు మళ్లీ ఎప్పటి నుంచి మొదలు కానున్నాయనే విషయంలో కచ్చితమైన తేదీని ప్రకటించలేమని రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు సాధారణ స్థితికి రాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్యాసింజర్ రైళ్లపై ఈ సంవత్సరం రూ.4,600 కోట్ల ఆదాయం వచ్చిందని, ఈ సంవత్సరాంతం లోపు రూ.15,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పలు రైళ్లను నడుపుతున్నట్లు ఆయన వివరించారు. గత సంవత్సరం ప్యాసింజర్ రైళ్లపై రూ.53,000 కోట్ల ఆదాయం వచ్చిందని, గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ప్యాసింజర్ రైళ్లపై ఆదాయం దాదాపు 87 శాతం తగ్గిందని యాదవ్ చెప్పారు.


ప్రస్తుతం నడుపుతున్న కోవిడ్-19 ప్రత్యేక రైళ్లలో కూడా మొత్తంగా చూసుకుంటే 30 నుంచి 40 శాతం మాత్రమే ప్రయాణం చేస్తున్నారని, ప్రజల్లో కరోనా భయం ఇంకా ఉందనడానికి ఇదే నిదర్శనమని రైల్వే బోర్డ్ చైర్మన్ వీకే యాదవ్ చెప్పుకొచ్చారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, దశలవారీగా సాధారణ రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని యాదవ్‌తో పాటు సీనియర్ రైల్వే అధికారులు చెప్పుకొచ్చారు.



Updated Date - 2020-12-18T21:42:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising