ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యుద్ధ నిబంధనలను ఉత్తర కొరియా అతిక్రమించింది: ఐక్యరాజ్యసమితి

ABN, First Publish Date - 2020-05-26T23:45:18+05:30

ఉత్తర కొరియా యుద్ధ నిబంధనలను అతిక్రమించిందని ఐక్యరాజ్యసమితి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూయార్క్: ఉత్తర కొరియా యుద్ధ నిబంధనలను అతిక్రమించిందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మే 3వ తేదీన డీ మిలటరైజ్డ్ జోన్(కొరియా దేశాల సరిహద్దు ప్రాంతం) వద్ద దక్షిణ కొరియా సేనలపై ఉత్తర కొరియా సైనికులు కాల్పులు జరిపారని, దీనికి ప్రతిగా దక్షిణ కొరియా సేనలు కూడా కాల్పులు జరిపాయని యూఎన్‌వో తెలిపింది. మొదట ఉత్తర కొరియా నాలుగు రౌండ్లు కాల్పులు జరుపగా, దక్షిణ కొరియా రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వివరించింది. అయితే ఈ విధంగా కాల్పులు జరిపి ఇరుదేశాలు 1950-53లో పరస్పరం చేసుకున్న ఆర్మిస్టైస్(యుద్ధ నియంత్రణ ఒప్పందం) ఒప్పందాన్ని అతిక్రమించాయని యూఎన్ పేర్కొంది.


ఈ కాల్పులకు సంబంధించి విచారణ జరిపేందుకు దక్షిణ కొరియా పూర్తి స్థాయిలో సహకరించిందని, ఉత్తర కొరియా మాత్రం సరైన సమాచారాన్ని ఇప్పటికీ అందించలేదని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. ఇదిలా ఉంటే తమ విచారణలో యుద్ధ ఒప్పందాన్ని ఉత్తర కొరియానే మొదట అతిక్రమించినట్లు తేలిందని, అయితే ఆ దేశం ఉద్దేశపూర్వకంగానే ఈ కాల్పులు జరిపిందా, లేక పొరపాటున జరిపిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని పేర్కొంది.

Updated Date - 2020-05-26T23:45:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising