ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌లో నామినేషన్లు, అఫిడవిట్లు

ABN, First Publish Date - 2020-08-22T07:58:16+05:30

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి దృష్ట్యా బిహార్‌ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ పకడ్బందీ మార్గదర్శకాలు జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదుగురితో మాత్రమే ఇంటింటి ప్రచారం..

ఓటర్లకు గ్లౌజులు...

పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు, సబ్బు నీళ్లు..


న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): కరోనా ఉధృతి దృష్ట్యా బిహార్‌ ఎన్నికలకు ఎలక్షన్‌ కమిషన్‌ పకడ్బందీ మార్గదర్శకాలు జారీ చేసింది. అక్టోబరు-నవంబరు నెలల్లో జరగబోయే బిహార్‌ అసెంబ్లీతో పాటు మధ్యప్రదేశ్‌, మరికొన్ని రాష్ట్రాల్లోని ఉప ఎన్నికలకు ఈ గైడ్‌లైన్స్‌ అమలు చేయనున్నారు. పోలింగ్‌ కేంద్రాలన్నింటినీ ఒకరోజు ముందుగానే బాక్టీరియా-రహితంగా శానిటైజ్‌ చేయనున్నారు.


డిజిటల్‌ ప్రచారానికి మాత్రమే పరిమితమవ్వాలన్న సూచనను అనేక పార్టీలు వ్యతిరేకించడంతో- అభ్యర్థితో సహా కేవలం ఐదుగురితో మాత్రమే ఇంటింటి ప్రచారానికి అవకాశం కల్పించనున్నారు. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను ప్రతీ చోటా అమలు చేయనున్నారు.


దేశ చరిత్రలో తొలిసారిగా --- ఓటర్లందరికీ గ్లౌజులు సమకూర్చి ఈవీఎం మీటలను నొక్కే అవకాశం కల్పించనున్నారు. అంతేక తొలిసారిగా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో తమ నామినేషన్లను, ధరావత్తును సమర్పించే వెసులబాటు కూడా కల్పించారు.  

  1. అభ్యర్థులు ఆన్‌లైన్లో నామినేషన్లు వేయొచ్చు. 
  2. అఫిడవిట్‌ను కూడా ఆన్‌లైన్లోనే సమర్పించవచ్చు
  3. డిపాజిట్‌ సొమ్ము కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు లేదా ట్రెజరీలో రొక్కం చెల్లించే అవకాశమూ ఉంటుంది
  4. నామినేషన్‌ దాఖలుకు అభ్యర్థితో పాటు ఇద్దరు మాత్ర మే వెళ్లాలి... రెండు వాహనాలకు మాత్రమే అనుమతి
  5. ఓట్ల లెక్కింపు జరిగేటపుడు ఒక హాల్లో ఏడు కంటే ఎక్కువ టేబుళ్లు ఉండరాదు. 
  6. ఎక్కువ మంది కౌంటింగ్‌ ఏజెంట్లు అటూ ఇటూ తిరుగాడకుండా భారీ స్ర్కీన్ల ద్వారా తెలుసుకునే ఏర్పాటు చేయాలి
  7. పోలింగ్‌ కేంద్రానికొచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్‌ ధరించాలి... మాస్క్‌లు లేని వారికి సిబ్బందే మాస్కులివ్వాలి.
  8. పోలింగ్‌ కేంద్రాల వద్ద శానిటైజర్లు, సబ్బు నీళ్లు ఉంచాలి
  9. 80 ఏళ్లు పైబడ్డవారు, కొవిడ్‌ పాజిటివ్‌ రోగులు, క్వారంటైన్‌లో, చికిత్సలో ఉన్నవారు, కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉన్నవారు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేయవచ్చు.
  10. కొవిడ్‌ రోగులు లేదా చికిత్సలో ఉన్నవారు చివరి గంటలో మాత్రమే ఓటు వేసేట్లు నిబంధనలు జారీ.

Updated Date - 2020-08-22T07:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising