ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘సామూహిక యోగా’ ను రద్దు చేసిన కేంద్రం

ABN, First Publish Date - 2020-06-05T20:22:41+05:30

ప్రతి యేటా కేంద్రం నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఈ సారి సామూహికంగా నిర్వహించడం లేదని కేంద్రం శుక్రవారం ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రతి యేటా కేంద్రం నిర్వహించే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఈ సారి సామూహికంగా నిర్వహించడం లేదని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. కరోనా కారణంగా యోగా దినోత్సవాన్ని ఈసారి సామూహికంగా నిర్వహించడం లేదని పేర్కొంది. డిజిటల్ మాధ్యమం ద్వారా నిర్వహిస్తామని, ఎవరికి వారు ఇంట్లోనే కుటుంబ సభ్యులతో యోగా చేయాలని కేంద్రం తెలిపింది. అయితే ఇంట్లో చేసినా సరే... సామాజిక దూరాన్ని, కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చేయాలని విజ్ఞప్తి చేసింది.


‘‘ఇంట్లో యోగా... కుటుంబ సభ్యులతో యోగా’ అన్న నినాదాన్ని కేంద్రం ప్రకటించింది. ముందుగా ప్రకటించినట్లు ప్రధాని మోదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున జమ్మూ కశ్మీర్‌లోని ‘లేహ్’ ప్రాంతంలో జరుపుకోనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా కారణంగా ప్రధాని మోదీ పర్యటన కూడా రద్దైనట్లు అధికారులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-06-05T20:22:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising