ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా కూటమిలో ‘‘ఒత్తిడి రాజకీయాలే’మీ లేవు : రౌత్

ABN, First Publish Date - 2020-12-19T19:51:39+05:30

తమ కూటమిలో ఎలాంటి ‘‘ఒత్తిడి రాజకీయాలు’’ లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ రాసిన లేఖను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : తమ కూటమిలో ఎలాంటి ‘‘ఒత్తిడి రాజకీయాలు’’ లేవని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. సోనియా గాంధీ రాసిన లేఖను భూతద్దంలో పెట్టి చూడవద్దని చురకలంటించారు. తమతో రెండు పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని, ఎలాంటి ఒత్తిడి రాజకీయాలూ లేవని స్పష్టం చేశారు. ‘‘సోనియా గాంధీ యూపీఏ అధ్యక్షురాలు. మహావికాస్ అగాఢీ రూపొందడంలో సోనియా, పవార్ పాత్ర కీలకం. కూటమిగా ఏర్పడిన నేపథ్యంలో మేము ఓ కామన్ మినిమం ప్రోగ్రాంను రూపొందించుకున్నాం. సోనియా గాంధీ తమకు లేఖ రాసింది కామన్ మినిమం ప్రోగ్రాం గురించే.’’ అని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో పేర్కొన్న పనులు కరోనా కారణంగా కాస్త మందకోడిగా సాగుతున్నాయని, అంతకు మించే వేరేదేమీ కాదని ఆయన తెలిపారు. మహారాష్ట్ర ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ఎలాంటి అజెండాను ముందు పెట్టినా, దానిని అంగీకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. తమ కూటమిలో కాంగ్రెస్ కూడా ఉందని, కూటమిలో ఎలాంటి ఒత్తిడి రాజకీయాలు లేవని రౌత్ స్పష్టం చేశారు. 


కామన్ మినిమమ్ ప్రోగ్రాంలో పేర్కొన్న కార్యక్రమాలను గుర్తుచేస్తూ... వాటిని తొందరగా పూర్తి చేయాలని డిసెంబర్ 14 కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీఎం ఉద్ధవ్ కు ఓ లేఖ రాశారు. దళితులు, గిరిజనులకు ఇచ్చిన సంక్షేమ పథకాలను వెంటనే నెరవేర్చాలని సోనియా కోరారు. 

Updated Date - 2020-12-19T19:51:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising