ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ యేడాది కొత్త పథకాలు లేవ్ : తేల్చేసిన ఆర్థిక శాఖ

ABN, First Publish Date - 2020-06-05T20:03:57+05:30

‘‘కోవిడ్ కారణంగా ప్రజా ఆర్థిక వనరులపై చాలా డిమాండ్ పెరిగింది. మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను అత్యంత జాగరూకతతో వాడుకోవాల్సిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఈ యేడాది ఎలాంటి కొత్త పథకాలను తాము ప్రవేశపెట్టడం లేదని కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం తేల్చి చెప్పేసింది. కరోనా, లాక్‌డౌన్ కారణంగా ఖర్చులు బాగా పెరగడంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేవలం ఆర్థిక శాఖే కాదు... ఏ శాఖ కూడా కొత్త పథకం ప్రకటించడానికి వీల్లేదని ఆర్థిక శాఖ తేల్చి చెప్పింది. అయితే... రెండు పథకాలకు మాత్రం ఆర్థిక శాఖ మినహాయింపులిచ్చింది.


ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీతో పాటు తాజాగా ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్‌.. ఈ రెండు పథకాలపైనే డబ్బులు వెచ్చించడానికి తాము అనుమతినిస్తున్నామని సంబంధిత వర్గాలు ప్రకటించాయి. మరే ఇతర కొత్త పథకాలు ప్రకటించడానికి వీల్లేదని నిర్మొహమాటంగా ప్రకటించింది.


‘‘కోవిడ్ కారణంగా ప్రజా ఆర్థిక వనరులపై చాలా డిమాండ్ పెరిగింది. మారుతున్న ప్రాధాన్యతలకు అనుగుణంగా వనరులను అత్యంత జాగరూకతతో వాడుకోవాల్సిన అవసరం ఉంది’’ అని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. బడ్జెట్ కింద ఇప్పటికే ఆమోదించబడిన పథకాలను కూడా 2022 మార్చి 31 వరకూ నిలిపేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే ఏవైనా ప్రత్యేక పరిస్థితులు తలెత్తినపుడు మాత్రం ఖర్చుల నిమిత్తమై సంబంధిత శాఖ కచ్చితంగా వాటిని పరిగణనలోకి తీసుకుంటుందని ప్రకటించారు. 

Updated Date - 2020-06-05T20:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising