ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో.. రాజధానిలో మరో లాక్‌డౌన్ ఉండదు: సీఎం

ABN, First Publish Date - 2020-07-08T23:28:50+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రముఖ నగరాలన్నింటిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ప్రముఖ నగరాలన్నింటిలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు రాజధాని చెన్నైలో మరోసారి లాక్‌డౌన్ అమలు చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అలాంటి యోచన ప్రభుత్వానికి అసలు లేదని తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి స్పష్టంచేశారు. కరోనా పేషెంట్ల కోసం 750 బెడ్లతో ప్రత్యేక సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం పళనిస్వామి మీడియాతో మాట్లాడారు. చెన్నై నగరంలో మరోసారి లాక్‌డౌన్ అమలు చేసే యోచన ప్రభుత్వానికి లేదని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అది సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. ‘తమిళనాడులో కరోనా వైరస్ మూడో దశ రాలేదు. ఈ సమయంలో మహమ్మారితో పోరుకు ప్రజలంతా సహకరించాలి’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-07-08T23:28:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising