ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాడ తెలియకుండా పోయిన సైనికులెవరూ లేరు..

ABN, First Publish Date - 2020-06-19T00:38:08+05:30

చైనా బలగాలతో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో జాడ తెలియకుండా పోయిన భారత సైనికులు ఎవరూ లేరని ఇండియన్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: చైనా బలగాలతో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణల్లో జాడ తెలియకుండా పోయిన భారత సైనికులు ఎవరూ లేరని ఇండియన్ ఆర్మీ వివరణ ఇచ్చింది. చైనా ఆర్మీ కస్టడీలో పలువురు భారత సైనికులు ఉన్నారంటూ వార్తలు వెలువడిన నేపథ్యంలో భారత ఆర్మీ ఈ వివరణ ఇచ్చింది. అయితే, చైనా కస్టడీ నుంచి సైనికులనెవరినైనా విడిచి పెట్టారా అనే దానిపై ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.


'ఇన్ చైనా-ఇండియా క్లాష్ అనే పేరుతో న్యూయార్క్ టైమ్స్‌లో జూన్ 17న ఇద్దరు నేషనలిస్ట్ నాయకులు చెప్పిన దానికి ఇది వివరణ. జాడ తెలియకుండా పోయన భారత సైనికులెవరూ లేరు' అని ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.


లడక్‌లోని గాల్వాన్ లోయలో చైనా బలగాలతో ఇటీవల జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా మాత్రం తమ వైపు మరణించిన, గాయపడిన వారికి సంబంధించిన అధికారిక లెక్కలు ఇంతవరకూ ప్రకటించలేదు. అయితే ఆ సంఖ్య 45 వరకూ ఉండవచ్చని భారత ఆర్మీ వర్గాల అంచనా.

Updated Date - 2020-06-19T00:38:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising