ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారతీయ ఉత్పత్తుల పట్ల వివక్ష లేదు : చైనా

ABN, First Publish Date - 2020-07-03T04:30:06+05:30

గుట్టు చప్పుడు కాకుండా ఎన్ని దారుణాలు చేసినా, పైకి మాత్రం అద్భుతంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్ : గుట్టు చప్పుడు కాకుండా ఎన్ని దారుణాలు చేసినా, పైకి మాత్రం అద్భుతంగా మాట్లాడగలమని చైనీయులు నిరూపించుకుంటున్నారు. భారత దేశంపైనే కాకుండా ఇతర దేశాలపై కూడా విరుచుకుపడుతూ, అన్ని రకాలుగా దురాక్రమణ బుద్ధిని ప్రదర్శిస్తున్న చైనా సుద్దులు చెప్తోంది. గల్వాన్ లోయలో భారత భూభాగాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేసిన చైనా తాను వివక్షతో వ్యవహరించడం లేదని చెప్తోంది. 


గల్వాన్ లోయలో జూన్ 15న భారత సైనికులపై చైనా సైనికులు దాడి చేసిన తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించింది. ఆ ప్రభావం ఆర్థికంగా గట్టిగా పడటంతో చైనా ఇప్పుడు నీతులు చెప్తోంది. 


చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో, తాము భారత దేశ ఉత్పత్తులు, సేవలపట్ల ఎటువంటి వివక్ష ప్రదర్శించడం లేదని పేర్కొంది. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇరు పక్షాలు అంగీకరించిన ఒప్పందాలను అమలు చేయాలని పేర్కొంది. 


చైనా  ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘గ్లోబల్ టైమ్స్’ కథనం ప్రకారం, ఆ దేశ వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి గావో ఫెంగ్‌ మాట్లాడుతూ. తాము భారత దేశ ఉత్పత్తులు, సేవలపట్ల ఎటువంటి వివక్ష ప్రదర్శించడం లేదన్నారు. ప్రాంతీయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు ఇరు పక్షాలు అంగీకరించిన ఒప్పందాలను అమలు చేయాలని పేర్కొన్నారు.  


భారత్-చైనా ఆర్థిక, వాణిజ్య సహకారం వృద్ధి చెంది, విజయవంతం అవడానికి కారణం ఇరు దేశాల ప్రభుత్వాలు, సంస్థలు చేసిన సమష్టి కృషి అని తెలిపారు. ఇరు దేశాల ప్రజల ఉమ్మడి మౌలిక ప్రయోజనాలకు ఇది దోహదపడుతుందన్నారు. 


Updated Date - 2020-07-03T04:30:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising