ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా బ్యాంకుల సమాచారం మా వద్ద లేదు: కేంద్రం

ABN, First Publish Date - 2020-09-20T21:10:17+05:30

ప్లాస్మా చికిత్సను కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్రధానమైన భాగంగా కేంద్రం గుర్తించట్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే రాజ్యసభలో వెల్లడించారు. అదే విధంగా.. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కేంద్రం ప్రస్తుతం పరిశీలించట్లేదని వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్లాస్మా చికిత్సను కరోనా ట్రీట్‌మెంట్‌లో ప్రధానమైన భాగంగా కేంద్రం గుర్తించట్లేదని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే రాజ్యసభలో వెల్లడించారు. అదే విధంగా.. ప్లాస్మా బ్యాంకులు నెలకొల్పాలనే ప్రతిపాదనను కేంద్రం ప్రస్తుతం పరిశీలించట్లేదని వెల్లడించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 


ఈ తరహా బ్యాంకులను ఏర్పాటు చేసే రాష్ట్రాలు చొరవప్రదర్శిస్తున్నాయని, కేంద్రం వద్ద మాత్రం ప్లాస్మా బ్యాంకులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. కరోనా చికిత్స ప్రోటోకాల్‌కు సంబంధించి ప్లాస్మా చికిత్స ఓ పరిశీలనాత్మక చికిత్సగా మాత్రమే కేంద్రం గుర్తించిందని, అది కూడా కొందరు రోగులకు మాత్రమే అందించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. కృత్రిమంగా ఆక్సిజన్ అందించడం, స్టెరాయిడ్లు వంటి ఇతర చికిత్సలు ప్రయోజనం చేకూర్చని సందర్భాల్లో ఈ ప్లాస్మా చికిత్స వైపు మొగ్గొచ్చని అయితే డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఇది జరగాలని కరోనా ప్రోటోకాల్ సూచిస్తోంది. 

Updated Date - 2020-09-20T21:10:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising