ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌తో ‘సీఓ2’ ముప్పు ఉండదు: శాస్త్రవేత్తలు

ABN, First Publish Date - 2020-10-03T08:34:09+05:30

గంటల తరబడి మాస్క్‌ ధరిస్తే.. శరీరంలోకి ఆక్సిజన్‌ ప్రవాహం తగ్గి, కార్బన్‌ డయాక్సైడ్‌ (సీఓ2) మోతాదు పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమెరికాలోని మియామీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఖండించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హ్యూస్టన్‌, అక్టోబరు 2 : గంటల తరబడి మాస్క్‌ ధరిస్తే.. శరీరంలోకి ఆక్సిజన్‌ ప్రవాహం తగ్గి, కార్బన్‌ డయాక్సైడ్‌ (సీఓ2) మోతాదు పెరుగుతోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని అమెరికాలోని మియామీ వర్సిటీ శాస్త్రవేత్తలు ఖండించారు. అలా జరిగే అవకాశం లేదని స్పష్టంచేశారు. ఆరోగ్యవంతులతో పాటు ఊపిరితిత్తుల వ్యాధులు కలిగిన రోగుల్లోనూ మాస్క్‌లు ధరించడం వల్ల ఎలాంటి ప్రతికూలతలు తలెత్తవని పేర్కొన్నారు. అయితే సరైన వెంటిలేషన్‌ లేక, పరిసరాల్లో గాలి ప్రవాహం ధారాళంగా లేని సందర్భాల్లో మాత్రమే మాస్క్‌లు ధరించిన వారు అసౌకర్యానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. ఎత్తైన ప్రదేశాలకు కాలినడకన లేదా వాహనాల్లో వెళ్లే సందర్భాల్లో శ్వాస ఆడకుంటే.. ఆ ప్రాంతం దాటే వరకు మాస్క్‌ను తొలగించి ఉపశమనాన్ని పొందొచ్చని సూచించారు. బహిరంగ ప్రదేశాల్లో, జన సమూహాల నడుమ సంచరించే క్రమంలో మాస్క్‌ వాడకం తప్పనిసరి అని తెలిపారు. 

Updated Date - 2020-10-03T08:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising