ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షమాపణ లేదు, ఫైనూ కట్టను: సుప్రీంపై కమ్రా మళ్లీ సెటైర్లు

ABN, First Publish Date - 2020-11-14T00:14:34+05:30

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కునాల్ కమ్రా విమర్శలు గుప్పించారు. ఏకంగా కాషాయం రంగులో ఉన్న సుప్రీం కోర్టు ఇమేజీని షేర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: సుప్రీం కోర్టుపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేస్తూ కోర్టు ధిక్కరణ చర్యల కింద చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్న కమెడియన్ కునాల్ కమ్రా.. మరోసారి రెచ్చిపోయారు. తాను సుప్రీం కోర్టుకి క్షమాపణలు చెప్పబోనని, ఎలాంటి జరిమానా చెల్లించబోనని జస్టిస్ కర్ణన్, లాయర్ ప్రశాంత్ భూషణ్ సంఘటనలను గుర్తు చేసే విధంగా వ్యాఖ్యానించారు. కోర్టు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాను సిద్ధమన్నట్లు ప్రకటించారు. కునాల్ చేసిన ఈ ట్వీట్‌పై ఇప్పటికే రేగిన దుమారం మరింత తీవ్రమైంది.


రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ ఛీఫ్ అర్నాబ్ గోస్వామికి సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై కునాల్ కమ్రా విమర్శలు గుప్పించారు. ఏకంగా కాషాయం రంగులో ఉన్న సుప్రీం కోర్టు ఇమేజీని షేర్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఇందులో మరో దారుణం ఏంటంటే.. కోర్టుపై ఉండాల్సిన త్రివర్ణ పతాకం స్థానంలో బీజేపీ జెండా ఉంది. దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ చర్యలకు దిగారు. సుప్రీంకోర్టుని, న్యాయమూర్తులను ప్రజలు ధైర్యంగా, బహిరంగంగా విమర్శించవచ్చునని, అయితే వాక్‌ స్వాతంత్య్రం అనేది చట్టానికి లోబడి ఉంటుందని కెకె.వేణుగోపాల్‌ అన్నారు.సుప్రీంకోర్టుని కాషాయరంగుతో, దానిపై త్రివర్ణపతాకం జెండా స్థానంలో బీజేపీ జెండాని చూపిస్తూ కమ్రా ట్వీట్‌ చేశారని, ఇది సుప్రీంకోర్టు ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందని, అతనిపై చర్యలకు అనుమతినివ్వాలని ముగ్గురు లాయర్లు కోరారు.


దీనిపై తాజాగా స్పందించిన కునాల్ కమ్రా.. సుప్రీంకోర్టు జడ్జీలతో పాటు, అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌కు ఓ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖ ప్రతిని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ ‘‘లాయర్లు లేరు, క్షమాపణ చెప్పేది లేదు, జరిమాన కట్టేది లేదు, నా సమయాన్ని వృధా చేసుకోను’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి చివరన దండం పెడుతున్నట్లు ఉన్న ఎమోజీలను షేర్ చేశారు. గతంలో సుప్రీం కోర్టుపై విమర్శలు చేసినందుకు గాను కోర్టు ధిక్కరణ కింద జస్టిస్ కర్ణన్ క్షమాపణలు చెప్పారు. లాయర్ ప్రశాంత్ భూషణ్ ఒక రూపాయి జరిమానా చెల్లించారు. కునాల్ చేసిన ఈ ట్వీట్‌లో వీరిద్దరినీ ఉద్దేశించి చేసినట్లుగా కనిపిస్తోంది.

Updated Date - 2020-11-14T00:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising