ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరువనంతపురం విమానాశ్రయంలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్

ABN, First Publish Date - 2020-09-22T15:48:01+05:30

కేరళలో ముగ్గురు అల్ ఖైదా ఉగ్రవాదుల గుట్టు రట్టు అయిన ఘటన మరవక ముందే మరో ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అరెస్టు చేసింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం (కేరళ): కేరళలో ముగ్గురు అల్ ఖైదా ఉగ్రవాదుల గుట్టు రట్టు అయిన ఘటన మరవక ముందే మరో ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు బృందం(ఎన్ఐఏ) అరెస్టు చేసింది. లష్కరే తోయిబా, ఇండియన్ ముజాహిదీన్ గ్రూపులకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు సోమవారం రాత్రి అరెస్టు చేశారు.సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను సోమవారం రాత్రి ఎన్ఐఏ అదుపులోకి తీసుకొని మూడు గంటలపాటు విచారణ జరిపింది. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరు లష్కరే తోయిబా, మరొకరు భారతీయ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ సభ్యులని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. 


అరెస్టు అయిన వారిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన గుల్ నవాజ్, మరొకరు షుహైబ్ కేరళలోని కన్నూర్‌కు చెందినవారు. 2008లో బెంగళూరులో జరిగిన వరుస పేలుళ్లకు సంబంధించి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఈ పేలుళ్ల కేసుకు సంబంధించి వారిపై లుకౌట్ నోటీసు కూడా జారీ చేశారు.రియాద్ నగరం నుంచి తిరిగివచ్చిన ఇద్దరు ఉగ్రవాదులను ఎన్ఐఏ, రా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు దర్యాప్తు చేశాయి. అనంతరం సుహైబ్ ను బెంగళూరుకు, గుల్ నవాజ్ ను ఢిల్లీకి తీసుకువెళ్లామని ఎన్ఐఏ అధికారులు  చెప్పారు. 

Updated Date - 2020-09-22T15:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising