ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డెబిట్ - క్రెడిట్ కార్డులకు... ఒకటి నుంచి కొత్త నిబంధనలు...

ABN, First Publish Date - 2020-10-01T00:28:05+05:30

డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి రేపటి(గురువారం) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సైబర్ నేరగాళ్ళు, ఇతరత్రా బ్యాంకు మోసాలకు అవకాశం లేకుండా చూసే క్రమంలో... ఈ నిబంధనలను రూపొందించారు. వివరాలిలా ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : డెబిట్, క్రెడిట్ కార్డులకు సంబంధించి రేపటి(గురువారం) నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సైబర్ నేరగాళ్ళు, ఇతరత్రా బ్యాంకు మోసాలకు అవకాశం లేకుండా చూసే క్రమంలో... ఈ నిబంధనలను రూపొందించారు. వివరాలిలా ఉన్నాయి. 



క్రెడిట్ కార్డులను అంతర్జాతీయ, ఆన్‌లైన్, కాంటాక్ట్ లెస్ కార్డ్ లావాదేవీలకు వినియోగించాల్సినపక్షంలో... ముందస్తు అనుమతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే... బ్యాంకులు జారీ చేసే క్రెడిట్, డెబిట్ కార్డులు కేవలం ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) ల వద్ద మాత్రమే పనిచేస్తాయన్న మాట. కాగా... రిస్క్ తీసుకునే కస్టమర్లకు సంబంధించి... వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆన్‌లైన్ లావాదేవీలకు వీలుగా ఆయా కార్డులను సంబంధిత ఖాతాకు అనుసంధానిస్తారు. అయితే... ఈ నిబంధన ప్రీ పెయిడ్, గిఫ్ట్ కార్డులకు మాత్రం వర్తించబోదు.


ఇక... ఆయా కార్డులను విదేశాల్లో వినియోగించుకోవాలనుకున్నా కూడా... బ్యాంకుల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. కాగా... కొత్త నిబంధనల నేపధ్యంలో... కార్డుల దుర్వినియోగం, మోసాలు తగ్గుతాయని బ్యాంకింగ్ రంగ నిపుణులు భావిస్తున్నారు. కాగా... కొత్త కార్డుల జారీ తర్వాత... వాటి ద్వారా పొందాలనుకునే సేవలను... బ్యాంకుకు సమాచారమిచ్చి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం... ఒక రోజులో రూ. 2 వేల వరకూ కూడా... పిన్ ను ఎంటర్ చేయకుండానే కాంటాక్ట్ లెస్ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

Updated Date - 2020-10-01T00:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising