ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో ‘మిక్స్‌డ్‌ మోడ్‌’ విస్తరణ: గూగుల్‌

ABN, First Publish Date - 2020-02-08T09:43:53+05:30

ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నది ‘గూగుల్‌ మ్యాప్స్‌’..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నది ‘గూగుల్‌ మ్యాప్స్‌’ పైనే. ఆ మ్యాప్స్‌ ఇప్పటివరకు గమ్యం చేరుకునేందుకు ఉన్న వీలైనన్ని మార్గాలనే చూపుతున్నాయి. ఇకపై మిగతా మార్గాల్లోనూ ఏమేం రవాణా సౌకర్యాలున్నాయి? ఆటోలో వెళ్తే ఎంత సమయం పడుతుంది? ఇతర రవాణా ఎంచుకుంటే ఎంతసేపు అవుతుంది? రానుపోనుకు ఏ స్టేషన్‌లో మనం వాహనాన్ని తీసుకోవచ్చు? అనే విషయాలు సూచిస్తుంది. ఈ మేరకు ఢిల్లీ, బెంగళూరులో అందుబాటులో ఉన్న ‘మిక్స్‌డ్‌ మోడ్‌ కమ్యూట్‌’ ఆప్షన్‌ను భారత్‌లోని మిగతా నగరాలకూ విస్తరించనున్నట్లు ‘గూగుల్‌ మ్యాప్స్‌’ 15వ వార్షికోత్సవం సందర్భంగా సంస్థ ఉపాధ్యక్షుడు ఫిట్జ్‌ ప్యాట్రిక్‌ తెలిపారు. ప్రస్తుతానికి ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ వినియోగదారులకే అందుబాటులోకి రానుంది. కాగా.. గూగుల్‌ మ్యాప్స్‌లోని 14 ఫీచర్లలో 8 భారత్‌లోనే ప్రారంభించామని ఫిట్జ్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2020-02-08T09:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising