ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

300లోపు సిబ్బంది ఉంటే.. ఉద్యోగ కోతలకు అనుమతులు అక్కర్లేదు!

ABN, First Publish Date - 2020-09-20T08:03:14+05:30

‘‘మూడు వందలలోపు సిబ్బందితో పనిచేసే కంపెనీలు ఉద్యోగులు, కార్మికులను తొలగించడానికి, కొత్తవారి భర్తీకి ముందస్తుగా ప్రభుత్వ అనుమతులను పొందాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటూ ఓ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • లోక్‌సభలో 3 లేబర్‌ కోడ్‌ బిల్లులు పెట్టిన కార్మిక శాఖ 


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: ‘‘మూడు వందలలోపు సిబ్బందితో పనిచేసే కంపెనీలు ఉద్యోగులు, కార్మికులను తొలగించడానికి, కొత్తవారి భర్తీకి ముందస్తుగా ప్రభుత్వ అనుమతులను పొందాల్సిన అవసరం ఉండకూడదు’’ అంటూ ఓ ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. గతంలో వంద మందిలోపు సిబ్బంది ఉన్న కంపెనీలు ప్రభుత్వ అనుమతులతో పనిలేకుండా ఉద్యోగుల తొలగింపు, భర్తీ చేపట్టొచ్చనే నిబంధన ప్రస్తుతం అమల్లో ఉంది. ఈ సంఖ్యను 300కు పెంచాలని ప్రతిపాదించారు. శనివారం పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని వాతావరణం బిల్లు- 2020, సామాజిక భద్రత కోడ్‌-2020లను కార్మిక శాఖ మంత్రి సంతోశ్‌ గంగ్వార్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే కార్మిక యూనియన్ల ఏర్పాటు దగ్గరి నుంచి పని గంటలు, ఉద్యోగ కోతలు, భర్తీల దాకా అన్ని అంశాలపైనా మార్గదర్శకాలు విడుదల చేసే అధికారాలు రాష్ట్రాలకు చేకూరుతాయన్నారు. 


Updated Date - 2020-09-20T08:03:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising