రష్యాలో ఒక్కరోజులో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు!
ABN, First Publish Date - 2020-11-03T12:02:30+05:30
ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 4.69 కోట్లను దాటింది. మృతుల సంఖ్య 12.06 లక్షలను...
మాస్కో: ప్రపంచంలో కరోనా బాధితుల సంఖ్య 4.69 కోట్లను దాటింది. మృతుల సంఖ్య 12.06 లక్షలను దాటింది. వ్యాధి నుంచి కోలుకున్నవారి సంఖ్య 3.38 కోట్లను దాటింది. ప్రపంచంలో ప్రస్తుతం 1.19 కోట్ల యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 85,510 మంది పరిస్ధితి విషమంగా ఉంది.
ఇదే సమయంలో కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చామని చెప్పుకుంటున్న రష్యాలో రోజురోజుకు కరోనా కేసులు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఆదివారం ఒక్కరోజే రష్యాలో ఏకంగా 18,665 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనికిముందు అక్టోబరు చివరి రోజున 18,140 కరోనా కేసులు నమోదుకాగా, అంతకుముందు ఒక్కరోజులో 18,183 కేసులు నమోదయ్యాయి. కాగా బ్రెజిల్‌లో గడచిన 24 గంటల్లో కరోనా కారణంగా 190 మంది మృతి చెందారు. దీంతో బ్రెజిల్‌లో మొత్తం మృతుల సంఖ్య 1,60,074కు చేరింది.
Updated Date - 2020-11-03T12:02:30+05:30 IST