ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇవే నా చివరి ఎన్నికలని చెప్పలేదు: నితీష్

ABN, First Publish Date - 2020-11-13T22:26:43+05:30

భవిష్యత్తులో కూడా తాను పని చేయాల్సి వస్తే ఇదేరకమైన అంకితభావంతో పని చేస్తానని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలే తన చివరి ఎన్నికలని తాను చెప్పలేదని జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ అన్నారు. తాను చెప్పిన మాటలను మీడియా తప్పుగా అర్ధం చేసుందని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా తాను పని చేయాల్సి వస్తే ఇదేరకమైన అంకితభావంతో పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 'రిటైర్‌మెంట్ గురించి నేను చెప్పలేదు. అంతా సజావుగా జరుగుతుందని, అంతా సజావుగా ముగుస్తుందని నేను ప్రతి ఎన్నికల్లో చెబుతుంటాను. గత ఎన్నికల ర్యాలీలోనూ ఇదే చెప్పాను. నా పూర్తి ప్రసంగం మరోసారి వింటే మీకే అర్ధమవుతుంది' అని జేడీయూ సుప్రీం అన్నారు. బీహార్ ఎన్నికల ప్రచారం చివర దశలో నితీష్ ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించినట్టు మీడియాలో వార్తా కథనాలు వచ్చాయి.  పోరాటానికి ముందే నితీష్ చేతులెత్తేశారని, తన ప్రకటనతో ఓటమిని అంగీకరించరని విపక్ష మహాఘట్ బంధన్ నేతలు విమర్శలు సైతం ఎక్కుపెట్టారు.

Updated Date - 2020-11-13T22:26:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising