ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా సోకినా.. ఆ లక్షణాలేవీ కనిపించలేదు: ప్రముఖ సింగర్

ABN, First Publish Date - 2020-04-10T22:00:16+05:30

ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గజగజలాడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాస్‌ఏంజెలిస్: ప్రపంచం మొత్తాన్ని కరోనా మహమ్మారి గజగజలాడుతోంది. ఈ క్రమంలో ఎవరైనా పక్కన దగ్గినా, తుమ్మినా ప్రజలు వణికిపోతున్నారు. కొన్ని దేశాల్లో అయితే ఎవరైనా బయట కావాలని దగ్గితే హత్యానేరం కేసు నమోదు చేస్తున్నారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలాంటిది తనకు కరోనా వచ్చినా కూడా దగ్గు వంటి లక్షణాలు కనిపించలేదని ప్రముఖ సింగర్ పింక్ తెలిపారు. ఇంగ్లీష్ పాప్‌సింగర్ అయిన ఈమె.. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్నారు. తొలుత తన కుమారుడికి కరోనా సోకిందని, అప్పుడు డయేరియా, జ్వరంతో బాబు బాధపడ్డాడని ఆమె తెలిపారు. ఆ తర్వాత తనకు కరోనా సోకినా ఇటువంటి లక్షణాలేవీ కనిపించలేదని, కేవలం చలి, కడుపులో వికారంగా మాత్రమే అనిపించేదని చెప్పారు. అలాగే చిన్నప్పుడెప్పుడో ఆస్తమాతో బాధపడిన తాను.. 30ఏళ్ల తకంవాత నెబ్యులైజర్(ఆస్తమాతో బాధపడేవారు ఉపయోగించే పరికరం) వాడాల్సి వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత చేసిన పరీక్షల్లో ఆమె కరోనా పాజిటివ్‌గా తేలారు. చికిత్స అనంతరం కోలుకున్నారు.

Updated Date - 2020-04-10T22:00:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising