ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా టీకా: భారత్ సహాయం కోరిన నేపాల్!

ABN, First Publish Date - 2020-12-31T03:01:07+05:30

కరోనా టీకాల కోసం నేపాల్ భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా టీకాల కోసం నేపాల్ భారత ప్రభుత్వ సహాయాన్ని కోరింది. తమ దేశంలో 20 శాతం జనాభాకు సరిపడా టీకాలను భారత్ నుంచి కొనుగోలు చేసేందుకు నేపాల్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది. కరోనా కారణంగా నేపాల్ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇప్పటికే అక్కడ  దాదాపు 2.6 లక్షల మంది ఈ వ్యాధి బారినపడ్డారు. 1800 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కరోనా టీకా డోసులను సమకూర్చుకోవాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే వివిధ దేశాలను, టీకా తయారీ కంపెనీలను సంప్రదించిన అక్కడి ప్రభుత్వం తాజాగా భారత్‌కూ లేఖ రాసినట్టు నేపాల్ మీడియాలో ప్రచురితమైంది. అయితే..భారత్ ప్రభుత్వం నేపాల్‌కు ఈ విషయమై గత నెలలోనే భరోసా ఇచ్చింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక నేపాల్ అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చింది.

Updated Date - 2020-12-31T03:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising