ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌పై మళ్లీ విరుచుకుపడిన నేపాల్ ప్రధాని

ABN, First Publish Date - 2020-05-26T22:19:55+05:30

నేపాల్ ప్రధాని కేపీ శర్మ భారత్‌పై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా ప్రబలడానికి భారతే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కఠ్మాండు: నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి భారత్‌పై మరోమారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కరోనా ప్రబలడానికి భారతే కారణమని మరోమారు ఆరోపించారు. ఇతర దేశాల వల్లే తమ దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయంటూ పరోక్షంగా భారత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణాసియాలోని మిగతా దేశాలతో పోలిస్తే నేపాల్‌లో కరోనా మరణాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. దేశ జనాభాలోని రెండు శాతం మంది ప్రజలకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా బాధితులకు క్వారంటైన్ సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన నేపాలీలను సురక్షితంగా స్వదేశానికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, నేపాల్ ప్రధాని ఓలి గతంలోనూ భారత్‌పై పలు విమర్శలు చేశారు. చైనా, ఇటలీ కంటే భారత్ నుంచి వ్యాపించే వైరస్ మరింత ప్రమాదకరమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  

Updated Date - 2020-05-26T22:19:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising