ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాటు నుంచి 72,703 మంది కోలుకున్నారు...

ABN, First Publish Date - 2020-03-23T17:51:15+05:30

చైనాతోపాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి 89 శాతం మంది రోగులు కోలుకున్నారని చైనా ఆరోగ్య కమిషన్ సోమవారం విడుదల చేసిన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ...
  • చైనా ఆరోగ్య కమిషన్ తాజా నివేదికలో వెల్లడి

బీజింగ్ (చైనా) : చైనాతోపాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారి నుంచి 89 శాతం మంది రోగులు కోలుకున్నారని చైనా ఆరోగ్య కమిషన్ సోమవారం విడుదల చేసిన తన తాజా నివేదికలో వెల్లడించింది. గత ఏడాది డిసెంబరు నెలలో చైనాలోని వూహాన్ నగరంలో ఉద్భవించిన కరోనా వైరస్ బారిన దేశంలో 81,093 మంది పడ్డారని వారిలో  72,703 మంది కోలుకున్నారని చైనా ఆరోగ్య కమిషన్ తెలిపింది. చైనా దేశంలోని పలు ఆసుపత్రుల్లో కరోనా వైరస్ తో మరో 5.120 మంది రోగులు చికిత్స పొందుతున్నారని కమిషన్ పేర్కొంది. సోమవారం వరకు చైనా దేశంలో కరోనా వైరస్ వల్ల 3,270 మంది మరణించారని తేలింది. చైనాలోని మెయిన్ ల్యాండ్, బీజింగ్ ఉత్పత్తి కర్మాగారాలు, నిర్మాణ సంస్థలకు చెందిన 72, 703 మంది కరోనా రోగులు చికిత్స పొంది వైరస్ నుంచి కోలుకొని ఆసుపత్రుల నుంచి విడుదల అయ్యారని కమిషన్ వివరించింది. ప్రస్థుతం ఆసుపత్రుల్లో ఉన్నవారిలో 1749 మంది పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య కమిషన్ తన నివేదికలో పేర్కొంది. కరోనా వైరస్ ప్రారంభమైన హుబేయి ప్రావిన్సులోని వూహాన్ నగరంలోని ఆసుపత్రుల నుంచి 434 మంది రోగులను డిశ్చార్జ్ చేశామని చైనా వైద్యాధికారులు చెప్పారు. 

Updated Date - 2020-03-23T17:51:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising