ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోంలో వరదలు..487 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్

ABN, First Publish Date - 2020-07-13T13:43:05+05:30

అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తడంతో వరద బాధితులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కాపాడి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గువాహటి (అసోం): అసోం రాష్ట్రంలో వరదలు గ్రామాలను ముంచెత్తడంతో వరద బాధితులను జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) కాపాడి బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. బార్పేట జిల్లాలోని ఓ గ్రామం వరద ముంపునకు గురవడంతో 487 మందిని బోట్లలో సురక్షిత ప్రాంతానికి తరలించారు. అసోంలో కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తడంతో 950 గ్రామాలు వరదనీటిలో మునిగిపోయాయి. వరద బాధితులకు మాస్క్ లు పంపిణీ చేసి, వారు సామాజిక దూరం పాటించేలా చూస్తున్నారు. అసోంలోని జోర్హాట్, బోనగైగాం, కామెరూప్ మెట్రో, కామెరూప్ రూరల్, బక్సా, బార్పేట, కచర్, శివసాగర్, సోనిట్ పూర్, ధీమాజీ, తిన్ సుకియా ప్రాంతాల్లో 11 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. వరదబాధిత ప్రాంతాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి వరద సహాయ పనులు చేపట్టారు. పుతిమర్రి, బేకి, ఐ, పహుమర నదులు పొంగి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలు నీట మునిగాయి. 

Updated Date - 2020-07-13T13:43:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising