ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల కోసం అవసరమైతే ఎన్డీయేతో కటీఫ్: ఆర్‌ఎల్పీ చీఫ్..

ABN, First Publish Date - 2020-12-01T03:55:06+05:30

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఎన్డీయే నుంచి బయటికి వచ్చేస్తామని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జైపూర్: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోకుంటే ఎన్డీయే నుంచి బయటికి వచ్చేస్తామని రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్ పార్టీ (ఆర్‌ఎల్పీ) హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు రైతు వ్యతిరేకమైనవనీ.. వాటిని ఉపసంహరించు కోవాల్సిందేనని ఆర్‌ఎల్పీ చీఫ్, రాజౌరీ ఎంపీ హనుమాన్ బనివాల్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఓ వైపు కరోనా మహమ్మారి, మరోవైపు విపరీతమైన చలిలో రైతులు ఆందోళన చేస్తున్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని బనివాల్ కోరారు. ‘‘ఈ విషయంలో కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే.. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎన్డీయేకి ఇచ్చిన మద్దతుపై అర్‌ఎల్పీ పునరాలోచించాల్సి ఉంటుంది..’’ అని బనివాల్ పేర్కొన్నారు. తాము ఎన్డీయే మిత్రపక్షమే అయినప్పటికీ.. యువత, రైతులే తమ పార్టీకి బలమని ఆయన అన్నారు. రైతు ప్రయోజనాల కోసం అవసరమైతే మద్దతు ఉపసంహరించుకోవడానికి సైతం తాము వెనకాడబోమని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2020-12-01T03:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising