ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా ప్రభుత్వానికి వచ్చే ఢోకాయే లేదు : ఎన్సీపీ ప్రకటన

ABN, First Publish Date - 2020-05-28T22:45:50+05:30

మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, 5 ఏళ్లను పూర్తి చేసుకుంటుందని మంత్రి నవాబ్ మాలిక్ ధీమా వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : మహా వికాస్ అగాఢీ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, 5 ఏళ్లను పూర్తి చేసుకుంటుందని మంత్రి నవాబ్ మాలిక్ ధీమా వ్యక్తం చేశారు. మహా వికాస్ సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలల పాలనను పూర్తి చేసుకుందని, స్థిరంగా, బలంగానే ఉందని ప్రకటించారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వంలో పొరపొచ్చాలు వచ్చాయని పుకార్ల నేపథ్యంలో ఆయన పై విధంగా స్పందించారు.


‘‘మా ప్రభుత్వం ఆర్నెళ్ల పాలన పూర్తి చేసుకుంది. స్థిరంగా, బలంగానూ ఉంది. ఈ ప్రభుత్వం కొద్ది రోజుల పాటే మనుగడ సాగిస్తుందని బీజేపీ పేర్కొంది. కానీ కచ్చితంగా ఐదేళ్లూ పూర్తి చేసుకుంటాం’’ అని నవాబ్ మాలిక్ ప్రకటించారు.


ప్రభుత్వం అస్థిరపడుతుందని ప్రతిపక్ష బీజేపీ పుకార్లను లేపుతోందని, అలాంటిదేమీ జరగదని, అవి కేవలం గాసిప్స్ మాత్రమేనని కొట్టిపారేశారు. ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ అన్న సూత్రం ప్రకారమే సంకీర్ణం ఏర్పడిందని, కలిసే పనిచేస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం కోవిడ్‌తో పోరాడుతున్నామని, తొందర్లోనే దీనిని అధిగమించి, సుపరిపాలన అందిస్తామని నవాబ్ మాలిక్ తెలిపారు. 

Updated Date - 2020-05-28T22:45:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising