ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో ఎన్సీబీ దాడులు...క్షితిజ్ ఇంట్లో భారీగా పట్టుబడిన డ్రగ్స్

ABN, First Publish Date - 2020-09-25T18:59:42+05:30

డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ దూకుడు పెంచింది. ముంబైలోని పలు చోట్ల సోదాలు కొనసాగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: డ్రగ్స్ కేసు విచారణలో ఎన్సీబీ దూకుడు పెంచింది. ముంబైలోని పలు చోట్ల సోదాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ గుట్టు రట్టు చేసేందుకు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా కరణ్ జోహార్ సహాయకుడు క్షితిజ్ ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. భారీ మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. క్షితిజ్‌ను అధికారులు అరెస్టు చేశారు. కాగా ఇప్పటికే అరస్టయినవారు డ్రగ్స్ వ్యాపారుల 150 మంది పేర్లు వెల్లడించడంతో ఎన్సీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది. డ్రగ్స్ వ్యవహారంతో టీవీ నటుల ప్రమేయంపైనా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆధారాలు సేకరించింది. 


ఎన్సీబీ సమన్లు అందుకున్న టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీతీసింగ్ శుక్రవారం విచారణకు హాజరయ్యారు. నిన్ననే హైదరాబాద్ నుంచి ముంబై చేరుకున్న రకుల్ ఇవాళ ఉదయం ఎన్సీబీ కార్యాలయానికి వెళ్లారు. ఆమె స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సేకరించేది.. మాదక ద్రవ్యాలను అందించేవారు ఎవరు? రియాతో ఎలా పరిచయం అయింది.. తదితర ప్రశ్నలకు సమాధానాలను రకుల్ నుంచి అధికారులు రాబట్టనున్నారు.

Updated Date - 2020-09-25T18:59:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising