ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సోదరి విజ్ఞప్తిపై మావోయిస్టు లొంగుబాటు

ABN, First Publish Date - 2020-08-03T17:54:14+05:30

రక్షా బంధన్ సందర్భంగా సోదరి చేసిన విజ్ఞప్తిపై ఓ మావోయిస్టు నక్సలిజానికి స్వస్థి చెప్పి పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 దంతెవాడ (చత్తీస్‌ఘడ్): రక్షా బంధన్ సందర్భంగా సోదరి చేసిన విజ్ఞప్తిపై ఓ మావోయిస్టు నక్సలిజానికి స్వస్థి చెప్పి పోలీసుల ముందు లొంగిపోయిన ఘటన చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో వెలుగుచూసింది. దంతెవాడ జిల్లా పల్నార్ గ్రామానికి చెందిన మల్లా 12 ఏళ్ల వయసులో ఇంటి నుంచి వెళ్లి పోయి నక్సలైట్ ఉద్యమంలో చేరాడు. 14 ఏళ్లుగా మల్లా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని చెల్లెలు  లింగే ఆందోళన చెందారు. 2016వ సంవత్సరంలో మల్లా ప్లాటూన్ డిప్యూటీ కమాండరు అయ్యారు. భైరవ్ ఘడ్ ఏరియా కమిటీ  నక్సలైట్ కమాండరుగా పనిచేస్తున్న మల్లా తలపై పోలీసులు రూ.8లక్షల రివార్డు ప్రకటించారు. పోలీసుల కాల్పుల్లో తన సోదరుడు మరణిస్తాడని ఆందోళన చెందిన చెల్లెలు లింగే రక్షాబంధన్ సందర్భంగా సోదరుడు పోలీసులకు లొంగిపోవాలని విజ్ఞప్తి చేసింది. సోదరి లింగే చేసిన విజ్ఞప్తిపై స్పందించిన అన్న మల్లా నక్సలిజానికి స్వస్థి చెప్పి లొంగిపోయి సోదరితో రాఖీ కట్టించుకున్నాడు. నక్సలిజాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయిన మల్లాకు పునరావాసం కల్పిస్తామని దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ చెప్పారు. 

Updated Date - 2020-08-03T17:54:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising