ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3 నెలల వేతనం విరాళమిచ్చిన ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2020-03-24T16:26:21+05:30

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పెద్దమనసు చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మూడు నెలల జీతాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన పెద్దమనసు చాటుకున్నారు. కరోనా బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన మూడు నెలల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన అవశ్యకతను చెబుతూ ముఖ్యమంత్రి ఈ విరాళం అందజేసినట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా విరాళాలతో ముందుకు రావాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యగా ఒడిశాలో 5 జిల్లాల్లో విధించిన లాక్‌డౌన్‌ను సోమవారం నుంచి 15 జిల్లాలకు విస్తరించారు. పూరి, నయాగఢ్, జగత్సింగ్‌పూర్‌, జైపూర్, భద్రక్, బాలాసోర్, థెన్‌కనల్, సంబల్‌పూర్, ఝార్సుగూడ జిల్లాల్లో మార్చి 29 వరకూ ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకూ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. హోం క్వారంటైన్‌‌లో ఉన్న వారి ఇళ్లకు స్టిక్కర్లు అంటించేందుకు కూడా ఒడిశా యంత్రాంగం నిర్ణయించింది.

Updated Date - 2020-03-24T16:26:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising