ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రహశకలంపై దిగిన నాసా వ్యోమనౌక!

ABN, First Publish Date - 2020-10-22T08:02:47+05:30

భూమిపై జీవరాశుల ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలను కనుగొనే దిశగా ‘నాసా’ మరో కీలక ముందడుగు వేసింది. నాసా పంపిన వ్యోమనౌక ‘ఒసిరిస్‌- రెక్స్‌’ నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భూమిపై జీవరాశుల ఆవిర్భావ రహస్యాన్ని తెలుసుకొనేందుకే


వాషింగ్టన్‌, అక్టోబరు 21 : భూమిపై జీవరాశుల ఆవిర్భావానికి సంబంధించిన రహస్యాలను కనుగొనే దిశగా ‘నాసా’ మరో కీలక ముందడుగు వేసింది. నాసా పంపిన వ్యోమనౌక ‘ఒసిరిస్‌- రెక్స్‌’ నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించి.. భూమికి అత్యంత సమీపం(200 మిలియన్‌ మైళ్ల దూరం)లో ఉండే ‘బెన్ను’ గ్రహశకలం (ఆస్టరాయిడ్‌)పై మంగళవారం రాత్రి దిగింది. అనంతరం వ్యోమనౌక తనలోని 11 అడుగుల రోబోటిక్‌ చేయితో గ్రహశకలం నేలలోకి డ్రిల్లింగ్‌ జరిపి, రాళ్ల నమూనాలను సేకరించింది. డౌన్‌లింకింగ్‌ ద్వారా వాటి ఫొటోలను డెన్వర్‌లోని లాక్‌హీడ్‌ మార్టిన్‌ స్పేస్‌ సెంటర్‌కు పంపే ప్రక్రియ కొనసాగుతోంది. ఇక వ్యోమనౌక నేరుగా ఆ రాళ్ల శాంపిళ్లతో 2023లో భూమికి తిరిగి చేరనుంది. గతంలో ఈ తరహాలో గ్రహశకలాల రాళ్ల నమూనాలను జపాన్‌ మాత్రమే సేకరించింది. ఇప్పుడు ఆ జాబితాలో అమెరికా కూడా చేరింది. 

Updated Date - 2020-10-22T08:02:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising