నింగిలోకి దూసుకెళ్లిన ‘కల్పనా చావ్లా’
ABN, First Publish Date - 2020-10-04T08:08:53+05:30
అంతరిక్ష పరిశోధనా రంగ యవనికపై భారత సంతతి వ్యోమగామి ఎస్.ఎ్‌స.కల్పనా చావ్లా పేరు మరోసారి మార్మోగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎ్‌సఎ్‌స)కి నిత్యావసరాలు, సాంకేతిక సరంజామాను తీసుకెళ్లేందుకు నార్త్ రోప్ గ్రమ్మన్ యాంటెరస్ రాకెట్ ద్వారా నాసా శుక్రవారం ప్రయోగించిన సిగ్నస్ స్పేస్ క్రాఫ్ట్‌కు ఆమె పేరు పెట్టారు...
- ‘నాసా’ సరుకు రవాణా అంతరిక్ష నౌకకు భారత సంతతి వ్యోమగామి పేరు
కేప్ కెనవెరల్ (అమెరికా), అక్టోబరు 3 : అంతరిక్ష పరిశోధనా రంగ యవనికపై భారత సంతతి వ్యోమగామి ఎస్.ఎ్‌స.కల్పనా చావ్లా పేరు మరోసారి మార్మోగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎ్‌సఎ్‌స)కి నిత్యావసరాలు, సాంకేతిక సరంజామాను తీసుకెళ్లేందుకు నార్త్ రోప్ గ్రమ్మన్ యాంటెరస్ రాకెట్ ద్వారా నాసా శుక్రవారం ప్రయోగించిన సిగ్నస్ స్పేస్ క్రాఫ్ట్‌కు ఆమె పేరు పెట్టారు. అమెరికాలోని మిడ్ అట్లాంటిక్ స్పేస్ పోర్టు నుంచి ‘కల్పనా చావ్లా’ అంతరిక్ష నౌక రయ్‌మంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌లో మహిళా వ్యోమగాముల సౌకర్యార్ధం ఏకంగా రూ.160 కోట్ల వ్యయంతో టైటానియం మరుగుదొడ్డిని ఏర్పాటు చేశారు.
Updated Date - 2020-10-04T08:08:53+05:30 IST