ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్తుండగా.. నగ్నంగా జాయిన్ అయిన ఆగంతకుడు..
ABN, First Publish Date - 2020-03-27T21:15:27+05:30
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలు రద్దయ్యాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకు....
నార్వే: కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక సేవలు రద్దయ్యాయి. ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో నార్వే దేశంలో స్కూళ్ళు మూతపడ్డాయి. కానీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించాలని పలు స్కూళ్ళు నిర్ణయించాయి. ఈ క్రమంలో గురువారం నాడు ఓ స్కూల్ ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. ఆ సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి స్కూల్ వీడియో కాన్ఫరెన్స్‌లోకి వచ్చేసాడు.
అప్పుడు అతని శరీరంపై నూలుపోగు కూడా లేదు. అలా 8-10 సంవత్సరాల మధ్య వయస్సున్న పిల్లల ముందుకు ఓ వ్యక్తి నగ్నంగా రావడంతో స్కూల్ యాజమాన్యం వెంటనే కాల్ కట్ చేసింది. ఈ ఘటనతో ఆ స్కూల్ యాజమాన్యం ఆన్‌లైన్ క్లాసులు కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సదరు ఆగంతకుడు కాన్ఫరెన్స్ కాల్ ఐడీని ఊహించాడని, ఇలా చాలామంది వీడియో కాన్ఫరెన్స్‌లకు సంబంధించిన వివరాల కోసం ఆన్‌లైన్‌ను జల్లెడపడుతున్నారని పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా ఇలాంటి విషయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Updated Date - 2020-03-27T21:15:27+05:30 IST